టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే.. మేం ఎప్పుడూ కలవం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే నంటూ మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది.. ఇక, రాత్రి బసచేసిన బాపుఘాట్ దగ్గర ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజ నుంచి మంచి స్పందన ఉందన్నారు.. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆయన.. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు.. మంగళ హారతులు పడుతున్నారు.. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు చెబుతున్నారని వెల్లడించారు. నిన్న పాతబస్తీలో పూల వర్షం కురిపించారు… బొట్టు పెట్టి ఆశీర్వదించారన్న ఆయన.. పాదయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు.. ఇక, తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు బండి సంజయ్.. ప్రభుత్వంపై ప్రజలు బాధ, ఆవేశం, ఆవేదనలో ఉన్నారని.. నేను పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించే అడుగుతున్నారన్నారు.
ఇక, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసింది… వాటికి అదనంగా రూ.1.40 వేలు ఇచ్చిందన్నారు బండి సంజయ్.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా ఇమ్మంటే… ఇప్పటివరకు కేసీఆర్ ఆ లిస్ట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. కాంట్రాక్టర్ల కమిషన్ ల కోసమే ఇళ్లు కడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ హయాంలో 70 వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేశారని తెలిపారు.. 40 ఎకరాల స్థలంలో బోజగుట్టలో ప్రభుత్వ అధికారులు తమ ఇళ్లను ఖాళీ చేయించారని స్థానికులు చెప్పారని.. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్లి రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితిలో కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. 100 రూమ్ ల గడీని… వందల కోట్లతో కేసీఆర్ కట్టుకున్నాడని ఫైర్ అయ్యారు.. అర్బన్ లో 8000 ఇళ్లు మాత్రమే కట్టించారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేవి కేసీఆర్ తో కావన్నారు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకైనా కేసీఆర్ సహకరించాలని డిమాండ్ చేసిన బండి సంజయ్. రూ. 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది… 2500 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందన్న ఆయన.. తెలంగాణకు అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత మాదేనన్నారు. 2.03 లక్షల వేల ఇళ్లను వెంటనే కట్టించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక వస్తేనే… కేసీఆర్ బయటికి వస్తాడని ఆరోపించిన సంజయ్.. నా పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం లభించిందని.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలనే చెప్పుకుంటున్నారన్నారు.. నా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే… ప్రజలు తిప్పికొడతారు.. తిరగబడతారని హెచ్చరించారు. పాతబస్తీలో ఎంఐఎం గుండాల చేతిలో నలిగిపోయిన హిందువులకు అండగా ఉండడం కోసమే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించినట్టు వెల్లడించిన సంజయ్.. పాతబస్తీని వదిలిన హిందువులు మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తాం అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని.. టీఆర్ఎస్తో కలిసి బీజేపీ ఎప్పుడూ పోటీచేయలేదన్నారు.
Also Read
- Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
- Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
- CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- hyderabad
- MIM
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!