NTV Telugu Site icon

Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్‌

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్‌ పై కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ హిందూ ధర్మం మీద కసితో.. హిందువులు అంటే కోపంతో ఉన్నావ్.. అంతేకాదు హిందూ దేవుళ్లంటే భయంతో ఉన్నావని కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అయితే నిన్న కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే.. కేసీఆర్ మతం గురించి మాట్లాడితే సెక్యులర్… మేం మాట్లాడితే మతతత్వమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కేసీఆర్ నిన్న కరీంనగర్‌కు వచ్చి 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా, 20 శాతం ఉన్న ముస్లింలను ఒక్కటి కావాలని పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. హిందుగాళ్లు… బొందుగాళ్లు అన్న ఆయనకు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

Read also: Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?

ఇక ఇప్పుడు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాగా.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన పోలీస్ వలయాన్ని చేధించుకొని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి జైశ్రీరామ్ అని గర్జించిన వ్యక్తిని తానే అన్నారు. సూటిగా చెబుతున్నానని, హిందువుల కోసం పని చేస్తానని, కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తానని, మోడీ బాటలో పయనిస్తానని తెలిపారు. దీంతో.. కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ ఓ వర్గం ఓట్లను ఏకం కావాలని చెబుతున్నారని… ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆ మతం పుచ్చుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని సవాల్ చేశారు. కేసీఆర్‌ హిందూ ధర్మాన్ని హేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అందరూ గుర్తించాలన్నారు. ఇక హిందువులంతా ఒక్కటైతే ఎలాంటి గుణపాఠం ఉంటుందో నిరూపించుదామన్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బండి సంజయ్ హిందువుల గురించి, హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నారని, మీ కోసం కొట్లాడే వ్యక్తిని తాను మాత్రమే అని బీఆర్ఎస్ కార్యకర్తలారా.. అన్నారు. కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చి తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. నిన్న కేటీఆర్ భైంసాకు వెళితే హనుమాన్ భక్తులు నిలదీశారని గుర్తు చేశారు. ముస్లింలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కాగా.. మేం ధర్మం కోసం, అభివృద్ధి కోసం రాజకీయం చేస్తామన్నారు.
Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?