Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిందూ ధర్మం మీద కసితో.. హిందువులు అంటే కోపంతో ఉన్నావ్.. అంతేకాదు హిందూ దేవుళ్లంటే భయంతో ఉన్నావని కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అయితే నిన్న కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే.. కేసీఆర్ మతం గురించి మాట్లాడితే సెక్యులర్… మేం మాట్లాడితే మతతత్వమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కేసీఆర్ నిన్న కరీంనగర్‌కు వచ్చి 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా, 20 శాతం ఉన్న ముస్లింలను ఒక్కటి కావాలని పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. హిందుగాళ్లు… బొందుగాళ్లు అన్న ఆయనకు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
Read also: Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ఇక ఇప్పుడు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాగా.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన పోలీస్ వలయాన్ని చేధించుకొని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి జైశ్రీరామ్ అని గర్జించిన వ్యక్తిని తానే అన్నారు. సూటిగా చెబుతున్నానని, హిందువుల కోసం పని చేస్తానని, కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తానని, మోడీ బాటలో పయనిస్తానని తెలిపారు. దీంతో.. కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ ఓ వర్గం ఓట్లను ఏకం కావాలని చెబుతున్నారని… ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆ మతం పుచ్చుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని సవాల్ చేశారు. కేసీఆర్ హిందూ ధర్మాన్ని హేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అందరూ గుర్తించాలన్నారు. ఇక హిందువులంతా ఒక్కటైతే ఎలాంటి గుణపాఠం ఉంటుందో నిరూపించుదామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ హిందువుల గురించి, హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నారని, మీ కోసం కొట్లాడే వ్యక్తిని తాను మాత్రమే అని బీఆర్ఎస్ కార్యకర్తలారా.. అన్నారు. కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చి తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. నిన్న కేటీఆర్ భైంసాకు వెళితే హనుమాన్ భక్తులు నిలదీశారని గుర్తు చేశారు. ముస్లింలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కాగా.. మేం ధర్మం కోసం, అభివృద్ధి కోసం రాజకీయం చేస్తామన్నారు.
Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని అవమానించిన రచయిత్రి.. ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..