Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని.. ప్రజా సంగ్రామ యాత్రపై దేశం మొత్తం చర్చ జరగిందని ఆయన అన్నారు. అధికారంలోకి బీజేపీ రాబోతోందని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీని త్వరలో రాష్ట్రానికి ఆహ్వనించే ప్రయత్నం చేస్తున్నామని…