Site icon NTV Telugu

Bandi Sanjay : మీది బిచ్చపు బతుకు.. ఓట్లకోసం టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్తారు..

Bandi

Bandi

Bandi Sanjay : ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి. బండి సంజయ్ మాట్లాడుతూ.. మీది బిచ్చపు బతుకు. ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్తారు అని పీసీసీ అధ్యక్షుని పై విమర్శలు చేశారు. ఆయన జీవిత రాజకీయాలలో కనీసం వార్డ్ మెబర్ స్థాయి నుండి పోటీ చేసి గెలుస్తే, ఓటు చోరీ వంటి విషయాలు తెలిసేవని వ్యాఖ్యానించారు.

Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్‌లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!

కాగా, పీసీసీ అధ్యక్షుని వ్యాఖ్యలు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు అడుగుతారన్నారని, కానీ దీనికి వ్యతిరేక వ్యూహాలను అమలు చేస్తున్నారు అని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికలు వున్నా లేకున్నా, మేము హిందువుల అండగా ఉంటున్నాం. తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ ని తయారు చేస్తామని అని ఆయన పేర్కొన్నారు. ఇంకా, రోహింగ్యాలు 2014కు ముందు దేశంలోకి వచ్చినట్లు, కొన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్, మమత నేతల పాలనలో ఆశ్రయం పొందిన విషయాలపై ఆయన టచ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లను అడిగితే ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చారు అని మండిపడ్డారు.అంతేకాక, వినాయక చవితి ఉత్సవాలు కూడా సరిగ్గా జరుపుకోలేని పరిస్థితి ఉందని, ప్రజలకు లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు అనే ప్రశ్నను కూడా బండి సంజయ్ ప్రశ్నించారు.

DELHI DRUGS: ఢిల్లీ, హైదరాబాద్‌లో భారీగా కొకైన్ కలకలం

Exit mobile version