Basara: బాసరలోని ట్రిపుల్ ఐటీ ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడ చదువుకోవటానికి సరైన సౌకర్యాలు లేవని, ఫ్యాకల్టీ, హాస్టల్, మెస్ తదితర సమస్యలు రాజ్యమేలుతున్నాయని విద్యార్థులు నిత్యం నిరసనలకు, ఆందోళనలకు దిగుతుండటం రోజూ పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. అందువల్ల బాసర ట్రిపుల్ ఐటీ అనగానే ఈ బాధలు వెంటనే గుర్తుకు రావటం సహజం. అయితే ఇదే సమయంలో ఆ సంస్థ పూర్వ విద్యార్థి విజయగాథ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అది కూడా ఇవాళే వెలుగులోకి వచ్చింది.
21 ఏళ్ల ఆ యువకుడి పేరు తంగెళ్లపల్లి నిఖిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం. తండ్రి ఎల్‌ఐసీ ఏజెంట్. తల్లి గృహిణి. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నిఖిల్.. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కలలు కన్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. స్కిల్స్ పెంచుకున్నాడు. తర్వాత ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. ఏడాదిన్నరగా ఇదే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమేజాన్ సంస్థకు చెందిన 40 టీమ్‌లకు అప్లై చేశాడు. కానీ 2 గ్రూపులు మాత్రమే స్పందించాయి.
Eatala-Komatireddy: ఈటల, కోమటిరెడ్డిలకు నిజంగా అంతుందా?. కేసీఆర్ పైన ఎందుకీ ఛాలెంజ్‌లు?
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్‌లైన్ అసెస్‌మెంట్ రాశాడు. ఒక గ్రూపులో అర్హత పొంది తర్వాత మే నెలలో జరిగిన ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాడు. తద్వారా స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో ఉన్న అమేజాన్ బ్రాంచ్‌లో ఉద్యోగం సంపాదించాడు. వార్షిక వేతనం 64 లక్షలు రూపాయలు. అంటే నెలకు 5 లక్షల రూపాయలకు పైగానే వస్తాయి. జాక్ పాట్ కొట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా గతాన్ని ఓసారి గుర్తుచేసుకున్నాడు. తమ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని, ముఖ్యంగా కొవిడ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ కరోనా బారినపడ్డారని తెలిపాడు.
అలాంటి పరిస్థితుల్లోనూ తాను ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని చేరుకోవటానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాయని వివరించాడు. లింక్డిన్ ద్వారా అమేజాన్ ఉద్యోగులతో టచ్‌లో ఉండేవాణ్నని పేర్కొన్నాడు. నిఖిల్ ఈ ఫీట్ సాధించటం పట్ల అతని గ్రామస్తులు, కాలేజీ యాజమాన్యం, బంధుమిత్రులు.. అందరూ ఆనందంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా అతని కుటుంబం గర్వంగా ఫీలవుతోంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి విదేశాలకు వెళుతున్న మొట్టమొదటి వ్యక్తి నిఖిలే. బాసర ట్రిపుల్ ఐటీ నిఖిల్‌ని ఘనంగా సత్కరించింది. సంస్థకు గొప్ప పేరు తెచ్చినందుకు అభినందనలు తెలిపింది.