Bandi Sanjay: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీదే అధికారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని.. ప్రజా సంగ్రామ యాత్రపై దేశం మొత్తం చర్చ జరగిందని ఆయన అన్నారు. అధికారంలోకి బీజేపీ రాబోతోందని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీని త్వరలో రాష్ట్రానికి ఆహ్వనించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తరువాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి… ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తాం అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందని ఆరోపించారు. కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేటీఆర్ ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు.
Also Read
మా రాజకీయ భవిష్యత్తు ఏమిటని అధికార పార్టీ నేతలకు టెన్షన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ భాష చూసి అన్ని వర్గాలు తలదించుకుంటున్నాయిన విమర్శించారు. కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తో కుటుంబ పాలన అంతం కాబోతోందని…తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. శ్రీలంక కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలైందని.. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా కుటుంబ పాలన వల్ల హీనంగా తయారైందని విమర్శించారు. త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణపై బీజేపీ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వరసగా బీజేపీ పెద్ద నేతలు తెలంగాణకు వస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
-
KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
-
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
-
Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
-
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్‌లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!