NTV Telugu Site icon

Bandi Sanjay: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీదే అధికారం…

Bandi Sanjay

Bandi Sanjay

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని.. ప్రజా సంగ్రామ యాత్రపై దేశం మొత్తం చర్చ జరగిందని  ఆయన అన్నారు. అధికారంలోకి బీజేపీ రాబోతోందని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీని త్వరలో రాష్ట్రానికి ఆహ్వనించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తరువాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి… ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తాం అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందని ఆరోపించారు. కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేటీఆర్ ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు.

మా రాజకీయ భవిష్యత్తు ఏమిటని అధికార పార్టీ నేతలకు టెన్షన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ భాష చూసి అన్ని వర్గాలు తలదించుకుంటున్నాయిన విమర్శించారు. కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తో కుటుంబ పాలన అంతం కాబోతోందని…తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. శ్రీలంక కుటుంబ పాలన కారణంగా అధోగతి పాలైందని.. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా కుటుంబ పాలన వల్ల హీనంగా తయారైందని విమర్శించారు. త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర  ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు.

తెలంగాణపై బీజేపీ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వరసగా బీజేపీ పెద్ద నేతలు తెలంగాణకు వస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.