Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్

  • హైకోర్టు కీలక తీర్పు
  • బెయిల్‌కు షరతులు విధింపు
  • 49 రోజుల జైలు తర్వాత ఊరట
  • దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం
Bandi Bhageerath

Bandi Bhageerath

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే దశకు రావడం, నిందితుడు ఇప్పటికే 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

 

బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు నిందితుడికి కొన్ని కీలక షరతులను విధించింది. లక్ష రూపాయల విలువైన వ్యక్తిగత బాండ్లతో పాటు ఇద్దరు పూచీకత్తులను (షూరిటీలను) సమర్పించాలని స్పష్టం చేసింది. దర్యాప్తుకు సహకరించాలని, సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని న్యాయస్థానం ఆదేశించింది. పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ పోక్సో కేసులో సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత భగీరథ్‌కు న్యాయస్థానం నుండి ఉపశమనం లభించింది.