Telangana Bandh: నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీని కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ వారం రోజులుగా నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా.. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇస్తారో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
అయితే, నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కు రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ జేఏసీ, యువజన నాయకులు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌తో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు మోతీలాల్‌ను కలిసేందుకు వచ్చిన నాయకులు రియాజ్, మానవతారాయ్, చెరగొండ వెంకటేష్, చంగాని దయాకర్, బాల లక్ష్మి, నిజాన రమేష్ తదితరులను నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరుద్యోగులను శాంతింపజేసి నాయకులను లోపలికి పంపించారు. నిరుద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డిని తక్షణమే చర్చలకు పిలవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. సీఎంతో చర్చించేందుకు ప్రయత్నిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం రేవంత్ చర్చకు పిలుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
ఇవీ డిమాండ్లు..
* గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచకూడదు
* నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.