Aishwarya Rajesh in Venkatesh Movie: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడుగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘SVC 58’ అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును స్వామి పాదాల వద్ద ఉంచి.. పూజలు చేశారు. ఆపై సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
SVC 58లో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. జులై 3 నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. నవంబరులో పూర్తిచేసి.. 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం’ అని చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య తెలుగు సినిమా చేస్తున్నారు. కౌసల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాల్లో ఐశ్వర్య నటించారు.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఇప్పటికే రెండు సిన్మాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్-2 భారీ హిట్‌గా నిలవగా.. ఎఫ్-3 మాత్రం భారీ డిజాస్టర్ అయింది. వెంకటేశ్, అనిల్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఎఫ్ సిరీస్‌లో వరుణ్ తేజ్ ఉండగా.. SVC 58లో మాత్రం వెంకీ సోలో హీరో. వెంకటేష్ చివరిసారిగా నటించిన సైంధవ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో వెంకీ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంకు బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.