పరిగిలో రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడాడు.. రేవంత్ రెడ్డి ఒక కమెడియన్ అంటూ ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు చెప్పులు మోసారు అని ఆయన విమర్శించారు.. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిది బట్లర్ ఇంగ్లీషు అని, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మీద విమర్శలు చేస్తే.. రాహుల్ గాంధీ అల్ ఇండియా పప్పు అయితే … రేవంత్ తెలంగాణ పప్పు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్ కు ఉరి పెడతారని, రేవంత్ ను ఎర్రగడ్డ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలని జగ్గారెడ్డి ని కోరుతున్నానన్నారు. ఏమైనా ఖర్చులు అయితే ఇస్తామని, అవినీతికి, కుంభకోణంలది కాంగ్రెస్ పార్టీ చరిత్రది అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.