Badangpet Mayor: టీఆర్ఎస్కు షాక్.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి బడంగ్‌పేట్ మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మరో కీలక నేత చేరేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఇటీవల ఖైరతాబాద్ కార్పొరేటర్ హస్తం గూటికి చేరగా.. ఇవాళ తాజాగా బడంగ్‌పేట మేయర్ తెరాసకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. బడంగ్‌పేట మేయర్ కాంగ్రెస్‌లో చేరడంతో అధికార తెరాసకు మరో షాక్ తగిలినట్లు అయింది. హైదరాబాద్ శివారు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హస్తం గూటికి చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస రెడ్డి, ఇతర నేతలు హస్తం పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఉన్నారు.
టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్‌ఎస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్‌తో పాటు 23వ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వీరంతా ఇవాళ హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
Satyavathi Rathod: ఎలాగో విజయం సాధించలేమని ముందే సభ పెట్టుకున్నారు
2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా పారిజాత విజయం సాధించారు. అప్పట్లో పారిజాతకు మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం జరగడంతో ఆమె తెరాసలో చేరారు. మేయర్ పదవి దక్కించుకున్నారు. కొంతకాలంగా పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరుల వద్ద వాపోతున్నారు.
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!