Hyderabad Crime: కని పెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులు గా మార్చింది.. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమర్చారు. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు.
ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ మురళీ రెడ్డి తన భార్య ద్వారక, కూతురుతో కలిసి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. మురళీ కూతురు ఏడో తరగతి చదువుకుంటోంది. మరోవైపు కుమార్ అనే వ్యక్తికి పవిత్ర అనే యువతితో వివాహమై.. విభేదాల కారణంగా దూరంగా ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. కుమార్ కు మురళీ రెడ్డి కూతురు స్నాప్ చాట్ లో పరిచయం అయ్యింది. వీరిద్దరూ ఒకరొనొకరు చాటింగ్ చేసుకునే వారు. కాగా.. మురళీ కూతురిని కుమార్ ట్రాప్ చేశాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను కిడ్నాప్ చేసి ఓ గదిలో నిర్భంధించాడు. కూతురి కనిపించక పోవడంతో తల్లిదండ్రులు.. అమ్మాయి ట్యాబ్ లో స్నాప్ చాట్ ద్వారా కుమార్ తో తమ కూతురు సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించారు.
కుమార్ ను కాంటాక్ట్ అయి తమ కూతుర్ని అప్పగించాలని కోరారు. దీనికి కుమార్ నిరాకరించాడు. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని.. కుమార్ ను ట్రాప్ చేసి తమ కూతురు ను తెచ్చుకుందాం అనుకున్నారు. బాలిక తల్లి ద్వారక.. ఆటో డ్రైవర్ కుమార్ ను హనీ ట్రాప్ చేసింది. గుర్తు తెలియని మహిళ లా చాట్ చేసింది. కాల్స్ తో
కుమార్ ను టెంప్ట్ చేసింది. కుమార్ ను ట్రాప్ చేసిన ద్వారక.. మియాపూర్ లోని ఇంటికి పిలిపించుకుంది. ద్వారక తన భర్త మురళీ రెడ్డి తో కలిసి కుమార్ పై దాడి చేసారు. కుమార్ ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కారులో తీసుకెళ్ళి కోదాడ సాగర్ కాలువలో పడేసారు. మురళీ రెడ్డి అరెస్ట్ తోనే అసలు విషయం బయటకు వచ్చింది.
అయితే, 2023 మార్చి లో ఆటో డ్రైవర్ కుమార్ అదృశ్యం అయ్యాడు. కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు పై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అమెజాన్ ఆఫీస్ వద్ద ఆటో లభ్యమైంది. ఆటో నెంబర్ ఆధారంగా విచారణ జరిపితే.. ఫేక్ నెంబర్ ప్లేట్ గా తేలింది. ఆ నెంబర్ ప్లేట్ ఉన్న వ్యక్తిని పట్టుకుంటే తనకు ఆల్రెడీ ఆటో ఉందని.. అమెజాన్ దగ్గర దొరికిన ఆటో తనది కాదని చెప్పాడు. పోలీసుకులకు ఈ ఘటన సవాల్ గా మారింది. ఆటో పై ఉన్న చలాన్ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. ఆటో నడుపుతున్న వ్యక్తి మురళీ రెడ్డిగా గుర్తించి పట్టుకున్నారు. కుమార్ ఆటో ఎందుకు నువ్వు నడుపుతున్నావ్ అని అడిగారు. పోలీసుల ప్రశ్నలకు మురళీ రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది. కుమార్ ను చంపి తన కూతురిని తీసుకుని వచ్చారని. కుమార్ ను భార్య భర్తలు (మురళీ రెడ్డి, ద్వారక) హత్య చేసినట్లు వెలుగులో రావడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Chiranjeevi : సర్దార్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్.. ?