NTV Telugu Site icon

Revanth Reddy: రేవంత్‌పై చొప్పువిసిరే యత్నం.. ఇద్దరు అరెస్ట్‌

Revanth Reddy Slipper

Revanth Reddy Slipper

Revanth Reddy: హాత్‌ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొంద‌రు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయ‌త్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం. ఈఘటన చోటుచేసుకోవడంతో కాసేపు ఆప్రాంతంలో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు నెలకొనలేదు.

Read also: Balakrishna Arrested: ఆత్మహత్య కేసు.. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్..

కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు ప్రారంభించారు. అయితే.. ములుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వ‌న‌దేవ‌త‌లు సమ్మక్క సారలమ్మల ప్రత్యేక పూజ‌లు నిర్వహించి రేవంత్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాద‌యాత్రను సోమ‌వారం నాడు ప్రారంభించారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి పాద‌యాత్ర మ‌హ‌బూబాబాద్ కు చేరుకున్న క్రమంలో అక్కడ అధికార పార్టీ కార్యక‌ర్తలు హ‌ల్ చ‌ల్ చేశారు. ఆయన పాద‌యాత్రను అడ్డుకునేందుకు నినాదాలు చేస్తూ.. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్రయ‌త్నించారు. అయితే.. అక్కడున్న పోలీసులు వెంట‌నే అప్రమ‌త్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్రయ‌త్నించిన వారు అధికార పార్టీ కార్యక‌ర్తల‌ని స‌మాచారం. రేవంత్‌ ప్రసంగిస్తున్న సమయంలో.. వీరు జై శంక‌ర్ నాయ‌క్ అంటూ నినాదాలు సైతం చేశారు. అయితే.. జై శంక‌ర‌న్న, జై శంక‌ర‌న్న అంటు నినాదాలు చేస్తున్న క్రమంలో వెంట‌నే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?

Show comments