Attack: కారెక్కిన మేకలు.. కత్తులతో దాడి చేసుకున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack With Knives: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ఓ కుటుంబం రెచ్చిపోయింది. తల్వార్లతో , రాడ్లతో మరో కుటుంబపై విచక్షణా రహితంగా దాడి చేసింది. గాయాలైన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
రంగారెడ్డి రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో ముస్తాక్ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరు ఇంటి ఎదురుగా కారును పార్క్ చేశారు. అయితే అక్కడే వున్న రిజ్వాన్ కుటుంబం కూడా నివాసం ఉంటుంది. అయితే బక్రీద్ సందర్భంగా వారు మేకలను ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మేకలను మేతకు బయటకు వదిలారు రిజ్వాన్ కుటుంబం. అయితే బయటకు వచ్చిన మేకలు కారు ఎక్కి పాడుచేశాయి. అయితే ముస్తాక్ అహ్మద్ అది గమనించి మేకలను వేరు చోటు వదలాలని, కారును పాడు చేస్తున్నాయని తెలిపాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన రిజ్వాన్, ముస్తాక్ అహ్మద్ పై దాడి చేశాడు. తల్వార్లతో , రాడ్లతో ఒకరినొకరు దాడిచేసుకున్నారు. ముస్తాక్ అహ్మద్ పై రిజ్వాన్ దాడి చేశాడు. ముస్తాక్ అహ్మద్, మహమ్మద్ అలీ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన రిజ్వాన్ కుటుంబంపై మర్డర్ కేస్ నమోదు చేయాలని ముస్తాక్ అహ్మద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు సైతం మాపై దాడి చేశారంటూ బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
బాధితుడు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. మేకలను కట్టేసుకోవాలని చెప్పినందుకు మా కుటుంబం పై రిజ్వాన్ కుటుంబం దాడి చేశారని అన్నాడు. లగ్జరీ కార్లను నడుపుతుంటానని పేర్కొన్నాడు. ఒక్కోసారి వాటిని ఇంటి ముందు పార్క్ చేయాల్సి వస్తుందని, ఆ సమయంలో మేకలు కార్లు పైకి ఎక్కడంతో డ్యామేజ్ అవుతుందని తెలిపానని అన్నాడు. ఈ విషయాన్ని రిజ్వాన్ కుటుంబానికి చెప్పామని తెలిపాడు. ఇవాళ ఉదయం రిజ్వాన్ కుటుంబం నా తమ్ముడు మహ్మద్ అలీని మాట్లాడుదామని పిలిపించి దాడి చేశారని అన్నాడు. మా తమ్ముడు మహ్మద్ అలీ ఛాతిలోకి మూడించులు కత్తి దూసుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తలపై కొట్టడంతో కుట్లు పడ్డాయని అన్నాడు. మా తమ్ముడు కండీషన్ క్రిటికల్ గా ఉందని కన్నీరుమున్నీరయ్యాడు. నాకు చేతికి, కాలికి గాయాలయ్యాయని అన్నాడు. మా కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. మాట్లాడుదామని పిలిచి ఇలా కొట్టారని తెలిపాడు. దీంతో పోలీసులు రిజ్వాన్ కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Abhishek Banerjee : జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతా: అభిషేక్ బెనర్జీ
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!