NTV Telugu Site icon

Terror attack: హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ

Torer Atack

Torer Atack

Terror attack: హైదరాబాద్‌లో అరెస్టయిన రాడికల్‌ ఇస్లామిక్‌ (హెచ్‌యూటీ) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. భోపాల్ – హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏటీఎస్ పోలీస్ ల నిందితుల కస్టడీ లో కీలక విషయాలు వెల్లడించారు. జిమ్ ట్రైనర్ యసిర్ హైదరాబాద్- భోపాల్ యువకులకు ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్ యూ టీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు షాక్‌ తిన్నారు. హెచ్ యూ టీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని గుర్తించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తుంది.

భోపాల్ లోని.. భోజ్ పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్రకర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియో లు..కోడ్ భాషలో వున్న 50 కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోని శాంతి ద్వీపం పెల్చేయలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేసిన ATS అధికారులు. శాంతి ద్వీపం పేల్చడం అంటే బాంబు పేలుళ్ళు జరపడం అని గుర్తించారు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్టు ATS టీమ్ గుర్తించింది. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, త్వరలో ఇంకా నిందితుల వద్ద నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏటీఎస్‌ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డ్యామ్‌లు, స్టేడియాలను ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అనంతగిరి కొండల్లో శిక్షణ పొందినట్టు ఏటీఎస్‌ గుర్తించింది. నిందితులు తమ ఉనికిని దాచుకునేందుకు డార్క్ వెబ్‌సైట్లను ఉపయోగించారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన 16 మందిని ఏటీఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఆరుగురిని కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా, మిగిలిన వారిని ఏటీఎస్ కస్టడీకి పంపింది. నిందితుడికి యాసిర్ నుంచి ఆదేశాలు అందినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. యాసిర్ కోసం ఏటీఎస్ అన్వేషణ ప్రారంభించింది. దాదాపు రెండేళ్లుగా హైదరాబాద్‌లో తలదాచుకున్న హెచ్‌యూటీ ఉగ్రవాదులపై ఏటీఎస్ నిఘా పెట్టింది. ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 9న అరెస్టయిన 16 మందిలో 11 మంది మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. మిగిలిన ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వారు. ఈ నెల 10న హుద్రాబాద్‌లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ నెల 15న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
Centre vs AAP: ఆప్‌కు మద్దతుగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో సీఎం నితీష్ కుమార్..