Weather Updates : ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మూడురోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసని తుఫాన్ ముంచుకొస్తున్న. ఈ ఏడాది మొదటి తుఫాన్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రజలపై విరుచకుపడేందుకు సిద్ధమైంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
వేసవికాలం ప్రారంభంలోనే భానుడి భగభగలకు మండిపోతున్న భాగ్యనగర వాసులు నిన్న కురిసిన చిరుజల్లులతో సేదతీరారు. తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడడంతో ప్రజలు కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడి అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. భగభగమండే రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
తాజావార్తలు
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..