తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీకి (BJP) షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, తాజాగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, అక్కడ ఇమడలేకనే తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?
ఆరూరి రమేష్ త్వరలోనే తిరిగి తన పాత పార్టీ అయిన బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే గులాబీ పార్టీ అగ్రనేతలతో ఆయన చర్చలు జరిపినట్లు, ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేతగా పేరున్న రమేష్ నిష్క్రమణ బీజేపీకి కొంత ప్రతికూల అంశమే అయినప్పటికీ, బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆయనతో పాటు జిల్లాకు చెందిన మరికొంత మంది కీలక నేతలు కూడా కారు ఎక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
