New Colours Revealed Globally by KTM: యువతలో ‘కేటీఎం’ బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు కేటీఎం బైక్ కొనాలని చూస్తుంటారు. సూపర్ లుకింగ్, అదిరిపోయే పర్ఫార్మెన్స్, క్యూట్ కలర్ కారంగా కేటీఎమ్ బైక్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్‌లను కంపెనీ రిలీజ్ చేస్తోంది. అంతేకాదు సరికొత్త రంగులలో కేటీఎం బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కేటీఎం నయా రంగుల్లో పలు బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 2024 కేటీఎం 390 అడ్వెంచర్, కేటీఎం 250 అడ్వెంచర్, కేటీఎం ఆర్‌సీ 125, కేటీఎం ఆర్‌సీ 200 బైక్‌లు ఉన్నాయి. కేటీఎం 390 అడ్వెంచర్ క్లాసిక్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో మరియు గ్రే అండ్ వైట్ బ్లెండ్‌తో వస్తుంది. కేటీఎం 250 అడ్వెంచర్ మ్యాట్ ఫినిషింగ్‌తో లూనార్ గ్రే కలర్, బ్లూ కలర్‌లో వస్తుంది. కేటీఎం ఆర్‌సీ 390 ఆరెంజ్ కలర్‌వేలో బహుళ-లేయర్డ్ ఫినిషింగ్‌తో వస్తుంది. కేటీఎం ఆర్‌సీ 125, ఆర్‌సీ 200 బైక్‌లు బ్లూ, బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Delhi Encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!
2024 కేటీఎం అడ్వెంచర్ 390 ఎక్స్ మరియు స్పోక్ వీల్ వెర్షన్‌లు మాత్రం పాత కలర్‌లోనే అందుబాటులో ఉంటాయి. 2023 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య దేశీయ అమ్మకాలలో 9.8 శాతం పెరుగుదల ఉందని కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు. కేటీఎం ఆర్‌సీ, కేటీఎం అడ్వెంచర్ లైనప్ అసమానమైన శక్తి, టార్క్ మరియు చురుకుదనంతో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయని బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ చెప్పారు.