Another Twist In TSPSC Paper Leak Case: తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తాజాగా మరో కొత్త మలుపు వెలుగు చూసింది. ఈ కేసులో సిట్ అధికారులు శంకర్ లక్ష్మి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ అంశంలో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ అయిన శంకర్ లక్ష్మీ వ్యవహారంలో కొంత కీలక సమాచారంతో పాటు కాల్ డేటా వివరాల్ని సేకరించిన సిట్.. ఈ క్రమంలోనే లీకేజీలో ఆమె పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్‌సీలో ఆమె విధులు నిర్వర్తిస్తోంది. DAO, AEE, AE పేపర్ల అంశంలో టీఎస్‌పీఎస్‌సీ వివరాలు దాచిపెట్టినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటివరకు సిట్‌కు టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు సిట్ తేల్చింది. అలాగే.. పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని కూడా టీఎస్‌సీఎస్‌సీ తప్పుడు వివరాలు ఇవ్వడంతో.. ఆ సంస్థపై సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంపై.. టీఎస్‌పీఎస్‌పై సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. దర్యాప్తుకు సహకరించకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది.
Kishan Reddy: ప్రకృతితో మమేకమై జీవించడమే భారతీయ జీవన విధానం
మరోవైపు.. రేణుక రాథోడ్ వ్యవహారంలోనూ సిట్ ఓ కీలక సమాచారాన్ని సేకరించింది. దీంతో.. ఆమెను రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. రేణుక రాథోడ్ నుంచి గంబీరాం రాహుల్‌కు గ్రూప్ పేపర్ లీకైందని గుర్తించిన సిట్ అధికారులు.. గంబీరాం పాత్రపై కూడా విచారణ ప్రారంభించారు. గంబీరాం రాహుల్‌ను రేణుక తన స్వంత వాహనంలోనే హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినట్లు సిట్ అధికారులు తమ విచారణలో తేల్చారు. అనంతరం ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని, లీకైన పేపర్‌ని రేణుక ప్రిపేర్ చేయించిందని తేలింది. రోజులు గడిచేకొద్దీ ఒక్కో ఊహించని వెలుగు ట్విస్ట్ చూస్తున్న ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో?
Dimple Hayathi: నేను డీసీపీని ఇబ్బంది పెట్టలేదు.. అంతపెద్ద ఆఫీసర్‌ను నేనేం చేస్తాను