NTV Telugu Site icon

BRS MLA Sanjay Kumar: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే

Brs Mla Sanjay Kumar

Brs Mla Sanjay Kumar

BRS MLA Sanjay Kumar: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న (ఆదివారం) రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంజయ్‌కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్‌ నేత తనయుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల కిందటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పోచారం హస్తం పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరారు. ముందుగా తాను సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.

Read also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే మకాం..

ఇక కాంగ్రెస్ నిర్వహించిన సభలో వెంకటరావు ప్రత్యక్షమై కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు షాకిస్తూ బీఆర్‌ఎస్‌ని వీడిన తొలి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్ కూడా హస్తం గూటికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరి టిక్కెట్లు పొందారు. దాన నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కడియం శ్రీహరి, కడియం కావ్య వరంగల్‌కు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో కడియం కావ్య విజయం సాధించారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్ కు 17 సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడంతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతలు బీఆర్ ఎస్ ను వీడగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు.
Astrology: జూన్ 24, సోమవారం దినఫలాలు