శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ అమీషా ఫుడ్ మేకింగ్ పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు నిర్వహించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. అమీషా ఫుడ్స్ కంపెనీపై దాడుల చేసి సీజ్ చేశారు. అంతేకాకుండా.. యాజమాన్యంపై కేసులు నమోదు, అరెస్ట్ చేశారు పోలీసులు. సీజనల్ ఫ్రూట్స్ అనే పేరుతో అమ్మకాలు చేపడుతూ.. ఐస్ క్రీమ్ ఇతర మీట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. 24 గంటల్లో పండుగ మారడానికి ఉపయోగిస్తున్న ఇథనాల్, ఇతర కెమికల్స్‌ను అధికారులు గుర్తించారు. పోర్క్ మీట్, ఐస్ క్రీమ్స్ ఇతర ప్రోడక్ట్స్ సీజ్ చేసి, భారీ ఎత్తున ఇథనాల్, స్పిరిట్, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మన దేశంతో పాటు, శ్రీలంక, జాంబియా, ఆస్ట్రేలియా దేశాలకు పోర్క్ మీట్, ఫ్రూట్స్ సరఫరా చేస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read : Somu Veerraju: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ..
కుళ్లిపోకుండా ఉండేందుకు ఇథనాల్, ఇతర కెమికల్స్ అమీషా ఫుడ్స్ సంస్థ వాడుతున్నట్లు తెలుస్తోంది. లోకల్ గా ఓ షెటర్ లో తయారీ చేసి ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడుతున్నట్లు, డ్రమ్ముల కొద్ది ఇథనాల్, పోర్క్ మీట్ తదితర ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ చేస్తున్నారు. వ్యాక్యూమ్ ప్యాక్ లు లేకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా తయారీ చేస్తున్నట్లు, కెమికల్స్ పై అవగాహన ఉన్న అమ్మాయిలతో తయారీ చేయిస్తున్నారు. యూపీకి చెందిన అమీషా ఫుడ్స్ యజమాని నగరంలో దందా నిర్వహిస్తున్నాడు. ఏఎంహెచ్ ఓ డాక్టర్ నగేష్ నాయక్, వెటర్నరీ డాక్టర్.. అబ్దుల్ వాసీద్.. నేతృత్వంలో అమీషా ఫుడ్స్ పై దాడులు నిర్వహించారు.
Also Read : Arun Subramanian: అరుణ్ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్‌కు తొలి దక్షిణాసియా న్యాయమూర్తి