Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్.. లాయర్ ఏమన్నారంటే ?
- బెయిల్ పై వున్న వ్యక్తి ప్రెస్ పెట్టడం పై పోలీసుల విచారణ..
- సంధ్యా థియేటర్ తొక్కిస లాట ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్..
- చిక్కడపల్లి సంధ్యా థియేటర్ కు వెళ్లి స్వయంగా సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advocate Varma: సంధ్యా థియేటర్ తొక్కిస లాట ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్ స్టేట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేసి ఇవాళ రెండోసారి ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ విచారణ గంటన్నర పాటుగా కొనసాగుతుంది. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ తోపాటు… ఎస్సై లతో కలిపి విచారణ కొనసాగుతుంది. ఈనేపథ్యంలో అడ్వకేట్ వర్మ మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే నోటీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నోటీలసు ఇచ్చిన తరువాత దీనికి సంబంధించిన స్టేట్ మెంట్ ఉంటుందని తెలిపారు. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరాలు సేకరిస్తారని తెలిపారు.
Read also:Allu Arjun: ప్రారంభమైన అల్లు అర్జున్ విచారణ.. బన్నీపై ప్రశ్నల వర్షం
Also Read
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
పోలీసులకు అల్లు అర్జున్ తెలిపిన వివరాలు తరువాత కూడా.. ఆశించనంతగా సమాధానం రాకపోతే సంధ్య థియేటర్ వద్దకు వెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేస్తారని అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద అసలు జరిగింది ఏమిటి ? అని పోలీసులు సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేస్తారన్నారు. మృతి, గాయాలు, కోమాపై వంటి జరిగిన ఘటనలపై వివరాలను సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో బెయిల్ వున్న వ్యక్తి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి గవర్నమెంట్ నన్ను అభాసుపాలు చేసింది అని స్టేట్ మెంట్ ఇచ్చారని, ఇది సరైంది కాదన్నారు. పోలీసుల సహాయ సహకారాలు మర్చిపోయి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు విచారిస్తారని తెలిపారు.
Read also: Allu Arjun Question Hour: క్వశ్చన్ అవర్.. అల్లు అర్జున్‌ని విచారించనున్న అంశాలు ఇవే..
సీన్ రీ కన్స్‌ట్రక్షన్ అంటే..
* సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది?
* అల్లు అర్జున్ ఎక్కడి నుంచి బయలు దేరారు?
* అల్లు అర్జున్ తో ఎంత మంది వచ్చారు?
* అల్లు అర్జున్ బౌన్సర్లు ఎంత మంది ఉన్నారు? వాళ్లు చేసిన పని ఏమిటి?
* అల్లు అర్జున్ వచ్చిన వాహనానికి? శ్రీతేజ్, మృతురాలు రేవతి వున్న దూరం ఎంత?
Read also: TG Congress Protest: నేడు ట్యాంక్‌బండ్ వద్ద కాంగ్రెస్ నిరసనలు.. కలెక్టరేట్ వరకు పాదయాత్ర..
అనే ప్రశ్నలకు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద స్వయం పోలీసులు వెళ్లి సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేస్తారుని అడ్వకేట్ వర్మ అన్నారు. సుమారు పోలీసులు పదివేల వీడియోలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి .. ఎటు వెళ్లారు? ఎక్కడ తోపులాట మొదలైంది. అనేది ఆరా తీస్తారు అని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిస లాట ఘటనలో చాలా మంది కూడా గాయపడ్డారు. కానీ వారి గురించి బయటకు రాలేదన్నారు. వాటి గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారని తెలిపారు. సినిమాకు వచ్చి గామపడ్డవారుకూడా చాలా మంది ఉన్నారన్నారన్నా. ఈ తోపులాట ఘటనలో శ్రీతేజ్, మృతురాలు రేవతి ఘటనలు మాత్రమే బయటకు వచ్చాయని తెలిపారు. ఇంకా ఎంత గాయపడ్డారు అనేది సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేస్తే తెలుస్తుందన్నారు. ఎలా జరగింది అనేది పోలీసులు స్వయంగా సంధ్యా థియేటర్ కు వెళ్లి తప్పకుండా సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేస్తారుని అడ్వకేట్ వర్మ అన్నారు.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!