Medak: మెదక్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 18 లక్షల 28 వేల 210 ఓట్లకు గాను పోలైన 13 లక్షల 72 వేల 894 ఓట్లు కాగా..
మెదక్ నుంచి బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. రెండు చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. నర్సాపూర్ అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు షురూ కానుంది. BVRIT ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
Read also: Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం..
అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్ కి 18 టేబుళ్లు, గజ్వేల్ కి 15, మిగిలిన ఐదు నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పటాన్ చెరు ఫలితం 23 రౌండ్లు, నర్సాపూర్, గజ్వేల్ 22, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19 మొత్తం 147 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెలువడనున్నారు. ముందుగా పోలైన 14, 297 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 2 రౌండ్లలో లెక్కించనున్నారు అధికారులు. 199 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణలో ఉండనున్నారు. 10 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ మొదలు కానుంది.
Adilabad: ఆదిలాబాద్ లో ఎంపి ఎన్నికల ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్ధం..