Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సి.ఎం.సి.లో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. 8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు. నిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు చేశారు. 15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూరైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.
Read also: Adilabad: ఆదిలాబాద్ లో ఎంపి ఎన్నికల ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్ధం..
అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచన జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరన్నారు. మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. మూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. 1000 మంది పోలీసులతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. పోలైన పోస్టల్ ఓట్లు 7414, మొత్తం సర్వీస్ ఓట్లు 724, మొత్తం ఓట్లు 17,4867, పోలైన ఓట్లు 12, 26 133, పోలింగ్ శాతం 71.92 కాగా.. 40 నిమిషాల్లో తొలి రౌండ్ పలితం వెలువడనుంది.
BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?