Site icon NTV Telugu

10th Class Exams: రేపటినుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు

Students

Students

ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది.

ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షలు రాసేచోటు తాగునీటి సదుపాయం ఏర్పాటుచేశారు.

కోవిడ్ నేపథ్యంలో 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష పేపర్ లను11 నుండి 6కి కుదించారు. ప్రశ్నల్లో ఛాయిస్ పెంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి . పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాలు(9.35) తర్వాత పరీక్ష కేంద్రాలకు అనుమతించబడరు. విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయాలని, ఆలస్యంగా రాకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు రాయబోయే విద్యార్ధులకు ఎన్టీవీ బెస్టాఫ్‌ లక్ చెబుతోంది.

Weather Update:తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

Exit mobile version