ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861…