SR University Hanamkonda: ఎస్ఆర్ యూనివర్సిటీలో దారుణం.. అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SR University Hanamkonda: బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 6వ అంతస్తు నుంచి రేణుశ్రీ ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు మరో విద్యార్థిని సూసైడ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాథోడ్ దీప్తి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీప్తి యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుకుంటుంది. గదిలో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంక్రాంతి హాలిడేస్ కావడంతో అందరూ ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉండటంతో దీప్తి ఇదికి వెళ్లిన స్నేహితులు షాక్ తిన్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకు చేరుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య వేసుకున్న దీప్తి స్వస్థలం అదిలాబాద్ జిల్లాగా గుర్తించారు పోలీసులు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురుగా గుర్తించారు. నిన్న రాత్రి కూడా తోటి విద్యార్థుల తో సాధారణంగానే మాట్లాడిన దీప్తి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి రాకపోవడం డోర్ కొట్టిన తలుపు తియకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా దీప్తి ఉరి వేసుకొని కనిపించింది. నిన్న రాత్రి రూమ్ లో దీప్తి ఒంటరిగా ఉన్నట్లు విద్యార్థినులు తెలిపారు. అర్ధ రాత్రి ఉరి వేసుకొని ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు. దీప్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దీప్తి లాస్ట్ కాల్ ఎవరికి చేసింది. ఎవరితో అయినా చాటింగ్ చేసిందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also Read
Read also: US-UK: హౌతీ తిరుగుబాటుదారులపై దాడి.. జో బైడెన్, రిషి సునాక్ రియాక్షన్ ఇదే..!
ఈనెల 6వ తేదీ సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే రేణుశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే కాలేజీ బిల్డింగ్ ఐదో అంతస్తు పైకి ఎక్కింది. వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. గీతం కాలేజీలో డేఆమె బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. మృతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెగా గుర్తించారు. తనకు ఇష్టమైన చేపల కూర చేయమని తల్లిని కోరిందని తల్లి తెలిపింది. కాలేజీకి వెళ్తున్న తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిసి షాక్‌కు గురయ్యానని కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. అయితే ఆత్మహత్యకు ముందు రేణుశ్రీ తన ఫ్రెండ్ కు ఫోన్ చేసిందని పోలీసులు గుర్తించారు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా మరేదైనా కారణాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Novak Djokovic Cricket: క్రికెట్ ఆడిన టెన్నిస్ స్టార్ జకోవిచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!