Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో మూవీ మూవీకి గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు మాధవన్. ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. మరో వైపు లీడ్ రోల్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు. ధురంధర్లో డిఫరెంట్ లుక్స్‌లో మెస్మరైజ్ చేసిన మ్యాడీ.. మరో ఎక్స్పరిమెంట్ మూవీతో వచ్చేస్తున్నాడు. మాధవన్ వన్స్ ఆపాన్ ఎ టైం అమ్మాయిలకు కలల రాకుమారుడు. కానీ నేడు వర్సటైల్ యాక్టర్. హీరోగా మార్కెట్ కోల్పోయాక సపోర్టింగ్ రోల్స్ షిఫ్టయ్యాడు. తండ్రిగా మెప్పించాలన్నా, విలన్‌గా భయపెట్టాలన్నా, సపోర్టివ్ క్యారెక్టర్‌తో సినిమాకు హైప్ తేవాలన్నా ఇతడే ఛాయిస్‌గా మారాడు.
సవ్యసాచి, నిశ్శబ్దం.. రెండేళ్ల క్రితం వచ్చిన సైతాన్లో యాంటోగనిస్టుగా అదిరిపోయే ఫెర్ఫామెన్స్ చూపించిన మాధవన్.. దేదే ప్యార్ దే2లో ఏజ్‌లో తన కన్నా పెద్దవాడైన అజయ్ దేవగన్‌కు మామగా మారిపోయాడు. రీసెంట్లీ ధురంధర్ సిరీస్ చిత్రాల్లో ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సంజ్యాల్ క్యారెక్టర్లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లీడ్ రోల్స్‌లో మెప్పిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. రాకెట్ నంబియార్‌లో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో మెప్పించాడు మాధవన్. అతడి నటనకు, మేకోవర్‌కు తగిన ప్రతిఫలం దక్కింది. జాతీయ అవార్డ్ వరించింది. నెక్ట్స్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త జీడీ నాయుడు జీవిత కథతో రాబోతున్నాడు. ఇందులో కూడా గుర్తు పట్టలేని విధంగా లుక్స్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు మ్యాడీ. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!