సంక్రాంతి ఎఫెక్ట్‌.. మళ్లీ పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచింది రైల్వేశాఖ.. ఇప్పటికే పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో మరోసారి ప్లాట్‌ఫాం టికెట్ల ధర డబుల్ చేశారు.. తాజాగా, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. నిన్నటి వరకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.10గా ఉండగా.. అది రెట్టింపు అయ్యింది.. సంక్రాంతి నేపథ్యంలో ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు అధికారులు.. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉండనుంది.. అయితే, సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతానికి పాత ధరలే కొనసాగిస్తున్నారు.

Read Also: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి గాయాలు

Related Articles

Latest Articles