Special Train: ఈ రైలు ‘రూటే’ సెపరేటు.. దటీజ్ వివేక్ ఎక్స్‌ప్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన ఇండియన్ రైల్వేస్‌లో వందల సంఖ్యలో రైళ్లు ఉన్నాయి. వేల సంఖ్యలో ట్రిప్‌లు తిరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. కోట్లాది రూపాయల టర్నోవర్‌ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ ఒక ట్రైన్ ఉంది. దాని పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలుకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అసలు దీని రూటే సెపరేటు. ఇది ఒకసారి బయలుదేరిందంటే ఏకంగా 4 వేల 2 వందల 73 కిలోమీటర్ల జర్నీని పూర్తిచేశాక గానీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించదు.
ఈ జర్నీకి 80 గంటల 15 నిమిషాల సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ పరుగులో భాగంగా 9 రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తూ 50కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలుకొని అసోంలోని దిబ్రుగఢ్ స్టేషన్‌కి చేరుకోవటంతో ఒక వైపు ప్రయాణం ముగుస్తుంది. మళ్లీ తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తుంది. ఇలా ఒక ట్రిప్ పూర్తి కావటానికి దాదాపు వారం రోజులు పడుతుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ తొలిసారిగా 2011 నవంబర్‌లో ప్రారంభమైంది. స్వామీ వివేకానంద 150వ జయంతి(2013)ని పురస్కరించుకొని రెండేళ్ల ముందుగానే ఈ రైలుకి పచ్చజెండా ఊపారు.
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
అయితే ఈ రైలు మార్గాన్ని కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నిలిపేశారు. ఇదిలాఉండగా వివేక్ రైలు రూట్ మన దేశంలోని అతి పొడవైన రైలు మార్గమే తప్ప ప్రపంచంలోనే పెద్దది మాత్రం కాదు. ఈ ఘనత రష్యా సొంతం. ఆ దేశంలో ఓ రైలు ఒకే మార్గంలో 9 వేల 2 వందల 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే మన వివేక్ ఎక్స్‌ప్రెస్ కన్నా రెట్టింపు మీద ఎక్కువేనన్నమాట. ఆ ట్రైన్ రష్యాలోని మాస్కో నుంచి వ్లాడివోస్టోక్ వరకు ప్రయాణిస్తుంది. దానికి కూడా ఒక ట్రిప్ పూర్తిచేయటానికి సుమారు ఏడు రోజులు పడుతుంది.
Naga Sourya: ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ కోసం లండన్ ప్రయాణం!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..