ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ రైతు పోరుబాట పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పనులు ఆగిపోయినవి..డిచ్‌పల్లి వద్ద ఆడపిల్లలు కూర్చున్నారు.. చిన్న పిల్లలను ఎత్తుకొని కూర్చున్నారు.. పోలీసుల భార్యలు, పిల్లలు ధర్నా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు రోడ్డు ఎక్కారు.. జైలుకు పోవడానికి రెడీ.. ఏడాది, రెండేళ్లు అయినా జనం కోసం జైల్లో ఉంటానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి.. అన్ని వర్గాలను మోసం చేశారని 420 కేసు పెట్టాలంటే కేసులు ఎవరి మీద చేశారని ప్రశ్నించారు. పోలీసులు అయినా, అధికారులు అయినా లెక్క రాసి పెట్టు.. ఎక్కువ చేస్తే మిత్తితో చెల్లిస్తామని ఆరోపించారు. చిట్టి నాయుడు వల్ల ఏం కాదు.. ఆయను చూసి మీరు ఎక్కువ చేయకండి అంటూ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం
వంద రోజుల్లో అన్ని ఇస్తాం అని చెప్పిన లుచ్చాలను జైల్లో పెట్టాలి.. రైతుల మీద, పేదల మీద కేసు పెడితే ఊరుకునేది లేదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి.. కాంగ్రెస్ మోసాలను అక్కడి ప్రజలకు చెప్పండి.. పోరాటం ఆగిపోదు.. ఆదిలాబాద్‌లో అగ్గి అంటుకుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్రా రైతులు రాహుల్ గాంధీకి లెటర్ పెట్టారు.. రైతు రుణమాఫీ, భరోసా ఏదీ అని లెటర్ పెట్టారు.. పోస్ట్‌కార్డు ఉద్యమం చేసారు.. దిష్టి బొమ్మ కాలబెడితే రైతుల మీద కేసులు పెట్టారు.. తెలంగాణ ఉద్యమం ఎలా చేశామో.. అలా మీ కోసం పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కంటే పెద్ద మోసగాళ్ళు బీజేపీ వాళ్ళు.. గుజరాత్‌కో నీతి తెలంగాణకో నీతా అని ప్రశ్నించారు. పత్తి ధర గుజరాత్ కంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఇస్తారు.. పత్తి క్వింటాల్‌కు రూ. 8800లు గుజరాత్ తరహాలో ఇక్కడి రైతులకు ఇవ్వాలని కేటీఆర్ తెలిపారు.
Kukatpally: కూకట్‌పల్లి గర్ల్స్ పేరుతో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా.. 38 మంది మహిళల అరెస్ట్..
సీఎం, పీఎంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో జుమ్లా పీఎం.. గల్లిలో హౌలా సీఎం ఉన్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ జరిగే వరకూ పోరాటం ఆపబోము.. 5 వందల బోనస్ లేదు.. సీఎం కుర్చీకే గ్యారంటీ లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. తొలి మాసికం పెట్టే సమయం వచ్చింది.. రాష్ట్రం అంతా పోరాటం చేస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని కేటీఆర్ తెలిపారు.