D. Sridhar Babu: కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గాక సర్వే చేసి ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కానీ మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి మరమ్మత్తులు పూర్తీ చేశామన్నారు. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు ఇస్తాం అని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో లు, పెనుగంగా వరదల పై అధికారులు ఎప్పటి అప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు.
Read also: Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి..!
కామాయి జాతీయ రహదారి పై రైతులను కలిశారు. పెను గంగా వరదల వల్ల తమకు జరిగిన నష్టాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టి రైతులు తీసుకెళ్ళారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూత పడ్డ సిమెంట్ పరిశ్రమను మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. సిసిఐ ని కేంద్రం పున ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తామన్నారు. సిసిఐ పై వాస్తవిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశించారు. సీసీఐ ముందుకొచ్చి పరిశ్రమను రీ ఓపెన్ చేయాలన్నారు. సిసిఐ స్క్రాప్ వేలం వేసే ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలన్నారు. సీసీఐ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. పెట్టుబడులు రావాలి , ఉపాధి కల్పించడమే మా లక్ష్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ను ఓపెన్ చేయాలని అన్నారు.
Boeing Starliner: స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు.. అసలు భూమికి తిరిగి వస్తుందా..?