Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత కొలనులో సాప్ట్ వేర్ ఎంప్లాయ్ మృతి చెందిన ఘటన ఘట్ కేసర్ లో కలకలం రేపుతుంది.
మాదాపూర్ లో ఓ ఐటీ సంస్థలో మేనేజర్ గా పని చేసే శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఘట్ కేసర్ పరిధిలోని PARV విల్లాలో విందు, వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 20 మంది ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. మద్యం సేవించి ఆట, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు. అయితే ఇంతలోనే ఓ విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకల్లో తోటి ఉద్యోగులే అజయ్ అనే వ్యక్తిని హత్య చేశారు. వీరందరూ పార్టీ నిర్వహిస్తున్న విల్లాలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ అందరూ మద్యం సేవిస్తూ.. అజయ్ తో మాట మాట కలుపుతూ స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు.
Read also: Telangana project: ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలు.. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..
అయితే అజయ్ అక్కడున్న వారితో తనకు స్విమ్మింగ్ రాదని చెబుతున్నా వినలేదు. మద్యం మత్తులో వున్న తోటి ఉద్యోగలందరూ అజయ్ ను స్విమ్మింగ్ పూల్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అజయ్ 45 నిమిషాల పాటు ఈత కులనులో కొట్టుమిట్టాడి బయటకు రాలేక చివరకు ప్రాణాలు వదిలాడు. అయితే ఇంత జరుగుతున్న మేనేజర్ శ్రీకాంత్ కూడా అక్కడే వున్న అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అజయ్ కు ఈత రాదని చెబుతున్న తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి మేనేజర్ తో సహా తోటి ఉద్యోగులు వెళ్లిపోయారు. స్విమ్మింగ్ పూల్ లోతుగా ఉండటం, అజయ్ కు ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలాడు. తరువాతి రోజు అజయ్ మృతి వార్త విన్న మేనేజర్, తోటి ఉద్యోగులు షాక్ తిన్నారు. మృతుడు అజయ్ మేన మామా కిషోర్ ఇచిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఘాట్ కేసర్ పోలిసులు. PARV ఫామ్ హౌస్ యజమాని రంజిత్ రెడ్డి, స్నేహితులు సాయి కుమార్, నిఖిల్, ఐటి సంస్థ మేనేజర్ శ్రీకాంత్ నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు.
Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం