Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. సాయంత్రం ఐదు దాటితే చాలు చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తోడు ఈదురు గాలులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వెట్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం కూడా 8 గంటలు దాటినా ముసుగులు తీయలేని విధంగా వణుకుతున్నారు.
Read also: Rashmika Mandanna: అదేంటి రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది!
సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో జిల్లా ప్రాంత వాసులు చలితో గజ గజ వణుకుతున్నారు. దీంతో ఏజెన్సీలో చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఇక కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 8.3 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్ లో 10.9 కాగా.. మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 11.2 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత కొమురం భీం జిల్లా లో నమోదైంది. సంగరెడ్డి జిల్లా కోహిర్ లో 8.8, న్యాల్కల్ 9.6, కంగ్టి 9.8 గా నమోదు అయ్యింది. నల్లవల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మొదక్ జిల్లా శివ్వంపేటలో 9.7, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 10.9 డిగ్రీలు నమోదైంది.
Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..