సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపుమీద మలుపు తీసుకుంటూ సాగుతోంది.. ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారగా.. అజ్ఞాతం వీడి మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు కరాటే కల్యాణి.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు తెలుసన్న ఆమె.. త్వరలో అందరిపేర్లు బయటపెడతా.. నాకు చాలా రోజులుగా అన్యాయం జరుగుతోంది.. చాలామంది మీద ఫైట్ చేస్తాను, నిలదీస్తాను, తంతాను కూడా అన్నారు. అయితే, కొన్ని రాజకీయ శక్తులు కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అయినా నేను వెనక్కి తగ్గను, ఝాన్సీ లక్ష్మిబాయిలా ఫైట్ చేస్తాను అన్నారు. నేను తప్పు చేయకుండా నిందలు వేస్తున్నారు.. నేను పిల్లల్ని ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక, తాను అదృశ్యం అయినట్టు వస్తున్నవార్తలపై స్పందించిన కరాటే కల్యాణి.. నేను హాస్పిటల్ కోసం వేరే దగ్గరికి వెళ్లాను.. నేను పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఒక ఆడపిల్ల మీద ఇంత నీచమా.. ఇంత దుర్భాషలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా మీద ఫైట్ చేస్తున్నవాళ్లు ఒక్కఆడదాన్ని ఎదుర్కోలేక ఇంత చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమ్మాయి కోసం పోస్ట్ చేస్తే పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.. పిల్లల్ని అమ్ముకునే హేయమైన స్థితిలో నేను లేనన్నారు. నాకు పెళ్లై కొన్ని కారణాల వల్ల విడిపోయాను. అప్పుడు అబార్షన్ అయింది. ఆ బాధ నాకు తెలుసని… నాకు పిల్లలు లేరు.. ఆడపిల్లలు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ పాపను నేను దత్తత తీసుకోలేదు అని తన దగ్గరున్న పాప గురించి మాట్లాడిన కరాటే కల్యాణి… ఏడాది వరకు దత్తత తీసుకోలేను నాకు తెలుసు.. కానీ, ఏడాది వచ్చాక దత్తత తీసుకుందామని అనుకున్నానని స్పష్టం చేశారు.