Hyderabad: హైదరాబాద్ లో వరుస హత్యలు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న (సోమవారం) అర్ధరాత్రి ఇంటి వద్ద అరుగుపై కూర్చున్న ఓ రియల్ ఏస్టేట్ వ్యక్తి పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వేటకొడవల్లతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఏం జరిగింది…
హైదరాబాద్ లోని ఎస్ఐ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రి అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో తన ఇంటి వద్ద అరుగుపై వచ్చి కూర్చున్నాడు. అదే తనకు ఆఖరి సమయం అని భావించుకోలేక పోయాడు ఖాద్రి. అయితే అక్కడికి కొందు బైక్ పై గుంపులుగా వచ్చారు. అయితే ఖాద్రి వారిని అంతగా పట్టించుకోలేదు. అయితే ఒక్కసారిగా వారందరూ ఖాద్రి పై దాడి చేశారు. అడ్డుగా కారు వున్న ఖాద్రి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తులు దాడి చేస్తునే వున్నారు. వారితో తెచ్చుకున్న కొడవల్లను బయటకు తీసి అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒకరి తరువాత ఒకరు అతనిపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో మహమ్మద్ ఖాద్రి గట్టిగా కేకలు వేసిన ఎవరూ బయటకు రాలేదు. అర్థరాత్రి కావడంతో ఎవరూ అతని అరుపులు పట్టించుకోలేదు. అయితే ఖాద్రిపై వేటకొడవల్లతో దాడి చేయడంతో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
ఖాద్రి ఎంత సేపటికి లోనికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా షాక్ తిన్నారు. ఖాద్రి రక్తపు మడుగులో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడరు. విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మనోహర్ తో పాటు చాంద్రాయన గుట్ట ఏసిపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీంను రంగంలో కి దింపి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఖాద్రిని కొడవల్లతో దాడి చేసిన సీసీ ఫొటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
TS Junior Doctors: సెక్రటేరియట్ కు జూనియర్ డాక్టర్లు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చ