Mahabubabad crime: అయ్యో తల్లీ ప్రసవం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయావా.. ఆసుపత్రి వద్ద ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad crime: మహబూబాబాద్ జిల్లా మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ప్రసవం కోసం వెళ్లి నిండు గర్భణీ ప్రాణాలు కోల్పోయింది. సాధారణ కాన్పు చేస్తానని ఆపరేషన్ చేయకుండా నొప్పులతో బాధ పడుతును ఆమెను అలాగే వదిలేసారు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. నిండు గర్భణీ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు వదిలిందని ఆసుప్రతి వద్ద ఆందోళన చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన వడ్డురి భాగ్యలక్ష్మి ప్రసవం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడున్న మరిపెడ లో వైద్యం అందించిన డాక్టర్ రవి సాధారణ ప్రసవం చేస్తానని భాగ్యలక్ష్మి నొప్పులు వస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. ఆమెకు వైద్యం కూడా చేయాలేదు. దీంతో భాగ్యలక్ష్మికి తీవ్ర నొప్పులతో అక్కడికక్కడే మృతి చెందింది. సాధారణ ప్రసవ ఆపరేషన్ వికటించి మెరుగైన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ రవి నిర్లక్ష్యం తోనే ఆమె చనిపోయిందని బంధువుల ఆరోపణ చేశారు. మృతదేహంతో జాతీయ రహదారి పై ధర్నా చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
మృతురాలు స్థానిక మరిపెడ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కూతురు రెండవ కాన్పుగా తల్లిగారింటికి వచ్చిందని బంధువులు తెలిపారు. అయితే.. సాధారణ హెల్త్ చెకప్ కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో డాక్టర్ల అత్యుత్సాహంతో సాధారణ కాన్పు చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసారని ఆరోపణ చేశారు. మరిపెడలో వైద్యం అందించిన డాక్టర్ రవి.. మరిపెడ మున్సిపల్ ఛైర్మెన్ అధికార బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు సిందూర భర్త కావడం గమనార్హం. బంధువులు ఎలాంటి సంఘటనలకు పాల్పడకుండా అధికార నేతలతో డాక్టర్ పైరెవిలు చేయిస్తు్న్నారని ఆరోపణలు చేసారు. దీంతో అక్కడ పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మృతురాలి బంధులు నిలదీశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని మండిపడ్డారు. తక్షణలో న్యాయం చేయాలని డాక్టార్ రవిని కఠినంగా శిక్షించాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీయమని బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!