Cyber Criminals: సైబర్ నేరగాళ్లు తెలివిమీరుతున్నారు. కొత్త తరహా నేర విధానానికి తెర లేపుతున్నారు. ప్రజల దృష్టిని ఎక్కువ ఏది ఆకర్షిస్తుంది.. వాళ్లను ఈజీగా ఎలా బురిడి కొట్టించవచ్చు అనే విషయాలు వాళ్లకు తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేనిపై చర్చ సాగుతోంది. ప్రజలను ఎలా బుట్టలో వేయవచ్చు అనే విషయాల్లో ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ముందుకు సాగుతున్నారు. సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా మరో ఇద్దరు ఈసైబర్ నేరగాళ్లకు వలలో పడ్డారు. లక్షల్లో మోసపోయారు.
Read also: Ivana : దిల్ రాజు బ్యానర్ లో ఇవానా
కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో ఉన్న డ్రగ్స్ పార్శిల్ ఒకటి స్వాధీనం చేసుకున్నాం. మీ స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలి. స్కైప్లోకి రండి అంటారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలంటూ ఖాతా వివరాలు, యూజర్ ఐడీలు అడుగుతారు. సహకరించకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ తో పాటు మనీలాండ రింగ్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారు. బాధితులు ఇచ్చిన వివరా లతో ఆ ఖాతాల్లో ఉన్న డబ్బును కొల్లగొడతారు. తెలివిమీరిన సైబర్ నేర గాళ్లు డబ్బుల కోసం ఎంచుకొన్న కొత్త తరహా నేర విధానం ఇది. సైబరా బాద్ పరిధిలో ఇలాంటి రెండు నేరాలు జరిగాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళలకు కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లు చేసిన నేర గాళ్లు వారి దగ్గర నుంచి రూ.18 లక్షలు కొల్లగొట్టారు. దీంతో వారు లబోదిబో మంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తమై సైబర్ నేరగాళ్లతో కాపాడాలని కోరుకుంటున్నారు.
Read also: Ganta Srinivasa Rao: టీడీపీకి ఝలక్..! పార్టీకి గంటా గుడ్‌బై..? చిరుతో భేటీ తర్వాత నిర్ణయం..!
అయితే.. ఆ కేటుగాళ్లు చెప్పినట్టు చేయొద్దు.. వారి ఉచ్చులో పడొద్దు.. మీ బ్యాంకు ఖాతాలు లూటీ చేసుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు,అంతే కాదు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సైబర్ పోలీసులు. ఎవరైనా మన ఫోన్‌కు ఓటీపీలు పంపి ఆ వివరాలను చెప్పమంటే దానిని సైబర్‌నేరగాళ్ల పనిగా గుర్తించాలని సూచించారు. అప్‌గ్రేడ్ పేరిట వచ్చే ఎలాంటి మెసేజ్‌లను నమ్మవద్దు అంటున్నారు. ఇక మరోవైపు.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులో దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో సోదాలు చేశారు సీబీఐ అధికారులు. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో… పలు రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, అస్సాంలో సోదాలు నిర్వహించారు.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ ప్రాంతంలో సైబర్ ఫ్రాడ్ కాల్ సెంటర్ బహిర్గతమైందని చెబుతున్నారు.. కాల్ సెంటర్‌లో సుమారు 1.5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సీబీఐ అధికారులు.
Anasuya Bharadwaj: కవితతో కవ్విస్తున్న అనసూయ.. నిన్నే పెళ్లాడుతా అంటూ..