Site icon NTV Telugu

BJP Vijaya Sankalpa Sabha: నగరానికి కాషాయం కళ.. రెపరెపలాడుతున్న జెండాలు

Bjp Modi

Bjp Modi

న‌గరంలో కాషాయి జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి. జూలై 3న బీజేపీ విజ‌య సంకల్ప సభ నిర్వ‌హించేందుకు భారీ ఏర్ప‌ట్లపై బీజేపీ శ్రేణులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. న‌గ‌రంలో ఎక్క‌డ చూసిన కాషాయి జెండాలు రెప‌రెపలాడుతుండ‌టంతో కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి పార్టీ చేరువ‌య్యేలా కార్య‌క్ర‌మాల‌ను శ్రీ‌కారం చుడుతున్నారు బీజేపీ శ్రేణులు. మోదీ సభకు భారీగా జనాన్ని తరలించడానికి పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. ఈనేప‌థ్యంలో.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించేలా కసరత్తు చేస్తున్నారు.

న‌గ‌రంలో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గసమావేశాలకు గురు, శుక్రవారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా.. తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ పేరిట నిర్వహించే ఈ భేటీల్లో పాల్గొనడానికి దేశ నలుమూలల నుంచి బీజేపీ ముఖ్య నాయకులు.. కేంద్ర మంత్రులు.. కేంద్ర మాజీ మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వ‌చ్చే ఏడాది (2023)లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి.. ముఖ్య నేతలంతా దళిత వాడలనూ సందర్శిస్తారు. ఇక‌ రాత్రిపూట నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లల్లో ముఖ్య అతిథులు భోజనాలు చేయనున్నారు.

ఈనేప‌థ్యంలో.. మాదాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లోని హోటల్స్‌ బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో కళకళలాడుతున్నాయి. న‌గరంలోని హోటల్స్‌లో 60 శాతానికి మించి రూమ్‌లు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ముుఖ్యంగా సమావేశాలు జరిగే నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ హోటల్‌లో అన్ని రూమ్‌లనూ మూడు రోజుల పాటు ఆ పార్టీ బుక్‌ చేసుకుంటే, మాదాపూర్‌తో పాటుగా బంజారాహిల్స్‌లోని కొన్ని హోటల్స్‌లో పెద్ద సంఖ్యలో రూమ్‌లను ఆ పార్టీ నేతలే బుక్‌ చేసుకున్నారు. అయితే.. మాదాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో ఉన్న స్టార్‌ హోటల్స్‌లో 60కి మించి బుకింగ్స్‌ జరిగాయని కొన్ని హోటల్స్‌ జనరల్‌ మేనేజర్లు అంటున్నారు.

YSRCP: వైసీపీలో వెన్నుపోట్లు..! ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Exit mobile version