Movie Offers Crime: దారుణం.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Girl Commits Suicide In Rayadurgam After Cheated By Purnachander In The Name Of Movie Offers: రంగుల ప్రపంచమైన సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఒక్కసారి క్లిక్ అయితే.. ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఒక సెలెబ్రిటీగా జీవితాన్ని లీడ్ చేయడంలో ఉండే కిక్కే వేరు. అందుకే.. సినిమాల్లో రాణించాలని ఎంతోమంది ఈ ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే.. ఈ సినిమాలపై ఉన్న మోజుని కొందరు దుండగులు క్యాష్ చేసుకుంటుంటారు. తమకు పడకసుఖాన్ని అందిస్తే, తప్పకుండా ఆఫర్లు ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిల్ని లొంగదీసుకుంటారు. తీరా కోరిక తీరాక, వారిని రోడ్డున వదిలేస్తారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాంటి దారుణమైన మోసాన్నే ఎదుర్కొంది. తనకు ఆఫర్లు ఇప్పిస్తాడన్న నమ్మకంతో ఒక వ్యక్తికి తన సర్వస్వాన్ని సమర్పిస్తే, అతడు మోసం చేశాడు. దీంతో అవమానంగా భావించిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరం ఉంది
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
ఆ యువతి పేరు బిందు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. హీరోయిన్లను చూసి, తాను కూడా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది. అంతే.. ఇండస్ట్రీలో ప్రయత్నాల కోసం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి తగిలాడు. తనకు ఇండస్ట్రీలో మంచి పేరుందని, తనకు ఎందరో దర్శకనిర్మాతలు తెలుసని పరిచయం నమ్మబలికాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావని, హీరోయిన్‌గా తప్పకుండా ఎదుగుతావని ఆశ పెట్టాడు. అయితే.. ఛాన్సులు ఇప్పించాలంటే, తన కోరిక తీర్చాలని కోరాడు. తనకు సినిమా ఆఫర్లు వస్తాయన్న నమ్మకంతో.. పాపం ఆ యువతి అతని మాటలు నమ్మి సర్వస్వం సమర్పించింది. అతనితో సహజీవనం చేసింది. కోరిక తీరినప్పటి నుంచి.. అదిగో, ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు కానీ, ఆమెకు ఛాన్సులు ఇప్పించలేదు. పైగా.. ఈమధ్య మరో యువతితో తిరగడం మొదలుపెట్టాడు. ఇది చూసిన బిందు.. తాను మోసపోయానని భావించి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ బాధలోనే.. రాయదుర్గంలోని 21 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Karumuri Nageswara Rao : సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!