Hyderabad Ragging: మళ్లీ పురివిప్పిన ర్యాగింగ్ భూతం.. రూమ్‌లో బంధించి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Gang Of Seniors Attacked Junior Student In IBS College: హైదరాబాద్ ర్యాగింగ్ భూతం మరోసారి పురివిప్పింది. కొందరు సీనియర్లు ఒక జూనియర్‌ని రూమ్‌లో బంధించి చితకబాదారు. ముఖంపై పౌడర్ చల్లి మరీ తీవ్రంగా కొట్టారు. తనని కొట్టొద్దని మొరపెట్టుకుంటున్నా.. కనికరం చూపించకుండా వాళ్లు పిడిగుద్దులు గుద్దుతూ గాయపరిచారు. ఆ తర్వాత.. మరో వర్గం వారు దాడి చేసిన విద్యార్థులపై ఎటాక్ చేశారు. ఇది చినికి చినికి గాలివానగా మారడంతో.. వ్యవహారంతో పోలీస్ స్టేషన్‌దాకా చేరుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో ఈ ఘటన వెలుగు చోటు చేసుకుంది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరారు. ఒక జూనియర్‌ని ఆట పట్టించాలనుకొని, అతనిపై దాడికి దిగారు. రూమ్‌లోకి తీసుకెళ్లి, ముఖంపై పౌడర్ చల్లి.. విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఎదురు చెప్పాడని.. కోపంతో ఆ సీనియర్లు రెచ్చిపోయారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు.. వెంటనే క్యాంపస్‌కు చేరుకొని, తమ పిల్లాడిని తీసుకెళ్లారు. దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇంత దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడుతుంటే.. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
మరోవైపు.. ఆ విద్యార్థిపై దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు ట్విటర్‌లో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి.. ఆ సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తనకు ఫిర్యాదు అందడంతో.. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. కాగా.. IBS కాలేజీలో ఎప్పట్నుంచో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!