BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLAs: బీజేపీ అభ్యర్థి, ఇద్దరు ఎమ్మెల్యేలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిన్న రోడ్ షోలో పర్మిషన్ ఇచ్చిన సమయాన్ని దాటి ప్రచారం చేసినందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి గోడం నగేష్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేందర్ బీజేపీ మండల పార్టీ కన్వీనర్ లపై VST (వీడియో సర్వేలెన్సు టీం) ఇన్చార్జి ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఖానాపూర్, ఇచ్చోడలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ఫేక్ వీడియోలు సృష్టించారని ఆరోపించారు.
Read also: Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
Also Read
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, అధికారం కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జరిగినట్టే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రచారంలో అధికారులు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం ప్రచారానికి కేటాయించారని వీఎస్ టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు.
Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!