Karimnagar: రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడక.. కాళ్లకు చెప్పులేకుండా తమ్ముడి ఇంటికి అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం గుర్తుకు వస్తుంది. రక్షా బంధన్ వారి మధ్య బంధానికి ప్రతీక. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ పండుగ. కానీ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త సన్నగిల్లుతున్నాయి. అలాంటి రోజుల్లో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒంటరిగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో బలం చచ్చిపోయినా.. తమ్ముడిపై తనకున్న ప్రేమకు చావు లేదని నిరూపించింది. ఎర్రటి ఎండను పట్టించుకోకుండా కాలినడకన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు బయలుదేరింది. తల్లిదండ్రుల కంటే తోబుట్టువులే ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది.
Read also: Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
Also Read
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ పొరుగున ఉన్న కొండయ్యపల్లికి వెళ్లింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా చెప్పులు లేకుండా 8 కిలోమీటర్లు నడిచి వస్తున్న వృద్ధురాలిని చూసిన ఓ యువకుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అంటూ పలకరించాడు. అప్పుడు వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టబోతున్నానని బదులిచ్చింది. తను కొత్తపల్లిలో ఉంటున్నానని, కొండయ్యపల్లిలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పింది. ఆ వీడియోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తమ్ముడంటే అంటే ఎంత ప్రేమో చెబుతూ తమ అక్కా, చెల్లెల్లను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధ బాంధవ్యాలుగా మారిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ నిజంగా అద్భుతం అని కొనియాడారు. ఇది కదా అక్క-తమ్ముడి అనుబంధానికి నిదర్శనం ఈ అనుబంధాన్ని మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఇలాగే కొనసాగించాలని కమెంట్ చేస్తున్నారు.
Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!