మాస్కులు ధరించనివారి నుంచి రూ.31 కోట్లు వసూలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోన్న సమయంలో… నివేదికను సమర్పించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఇవాళ విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరుకాగా.. ప్రస్తుతం అమలవుతోన్న లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి.. హైకోర్టుకు నివేదిక అందజేశారు.. కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. ఇక, బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని తెలిపిన డీజీపీ.. ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు.
మరోవైపు.. లాక్డౌన్ ను పకడ్బందిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని… మాస్కులు ధరించనివారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని.. వారిపై మొత్తం రూ.31 కోట్ల జరిమానా విధించామని వివరించారు. ఇక, భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామని, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టామని వివరించారు. అయితే, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, గతంలో పలు సందర్భాల్లో కోవిడ్ విషయంలో తెలంగాణ హైకోర్టు.. సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!