వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్‌ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. టీఆర్‌ఎస్ నేత…
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్‌డౌన్ సడలింపుల సమయంలోనే కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అసలు తమకు ఏదీ పట్టనట్టుగా చిన్నచిన్న కారణాలు చెప్పి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు కొందరు. దీంతో.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేరకు పోలీసు అధికారులకు డీజీపీ…