శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను ఎమర్జెన్సీ లైట్ లో అమర్చి తరలించే యత్నం చేసిన కేటుగాళ్లు. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన ఎమర్జెన్సీ లైట్ ను లగేజ్ బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఎమర్జెన్సీ లైట్ ను తూకం చేసిన అధికారుల బృందం. దాని బరువు కన్నా 6 కేజీల బరువు ఎక్కువుగా వుండడంతో లైట్ ను ఒపెన్ చేసారు అధికారులు. ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీ లో 6 కేజీల బంగారు బిస్కట్లను దాచి తరలించే యత్నం చేస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికి పోయారు కేటుగాళ్లు. బంగారు సీజ్ చేసి ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.