Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఈ సారి గుంపగుత్తగా ఇనయా రెహ్మాన్‌ను టార్గెట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది… అంటే హౌస్ లోని సగం మంది కంటెస్టెంట్స్ ఆమెకు ఓట్ వేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన అడవిలో ఆటలో ఇనయా ప్రదర్శించిన దూకుడును చాలామంది జీర్ణించుకోలేక పోయారు. కొందరికి దెబ్బలూ గట్టిగానే తగిలాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇనయా కాస్తంత రూడ్ గానే ఈ గేమ్ ఆడిందని, అలానే పలు సందర్భాలలో తన స్ట్రేటజీని మార్చుకుందని, కొన్ని చోట్ల ఫౌల్ గేమ్ ప్లే చేసిందని వీరంతా అభిప్రాయ పడ్డారు. అయితే… తనకు ‘గేమ్ ఇలా ఆడు’ అని చెప్పిన రోహిత్, మరీనా కూడా తననే నామినేట్ చేయడం ఇనయా తట్టుకోలేకపోయింది. ఇతరులు నామినేట్ చేసినప్పుడు నిబ్బరంగా ఉన్నా.. వారి విషయానికి వచ్చే సరికీ ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలానే రేవంత్ తీరుపైనా కొంతమంది ఇంటి సభ్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. అతన్ని కూడా ఆరుమంది నామినేట్ చేశారు.
Read Also: Magadheera: ఇప్పుడు రామ్‌చరణ్ వంతు.. ‘మగధీర’ స్పెషల్ షోలు
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఈ వారం హౌస్ మేట్స్ మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రామ్ హోస్ట్ అయిన నాగార్జునకూ ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో ఇప్పటికే ఆయన అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్‌ను నామినేట్ చేశారు. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు ఎంపిక చేసి వారిలో ఇనయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్ ఉన్నారు. సో… మొత్తంగా ఈ వారం నామినేషన్స్ జాబితాలో 10 మంది ఉన్నట్టు లెక్క. మరి తమని తాము సేవ్ చేసుకోవడానికి వీరంతా ఈ వారం టాస్క్‌లలో ఎలాంటి ప్రతిభ చూపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!