తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తెలిపిన సంగతి తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అలర్డ్‌గా ఉన్నారు. అయితే, రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని వెలుగుమట్ల గ్రామంలో ఇప్పటికే స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. సోమవారంతో ఆ గ్రామంలో లాక్‌డౌన్ ముగిసింది. అయినప్పటికే కేసులు నమోదవుతుండటంతో పాటుగా సోమవారం రోజున కరోనాతో ఒకరు మృతి చెందడంతో లాక్‌డౌన్‌ను మరో 15 రోజులపాటు పెంచుతూ గ్రామపంచాయతి నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీ విధించిన లాక్‌డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈరోజు నుంచి 15 రోజుల పాటు ఆ గ్రామంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
Read: మాధవన్ నుంచీ వరుణ్ ధావన్ దాకా… శిల్పాకు సినీ సెలబ్స్ మద్దతు!